Thursday, November 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాయితీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు చేసుకోవాలి

రాయితీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు చేసుకోవాలి

- Advertisement -

తుది గడువు ఈ నెల 22 వరకు
మండల వ్యవసాయాధికారి శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు

వ్యవసాయ యాంత్రీకరణ పథకం (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్)లో భాగంగా మహిళా రైతులు 2025-26 సంవత్సరానికి మండలంలో 50% రాయితీతో మొత్తం 131 యూనిట్ల పనిముట్లు కేటాయించడం జరిగిందని మండల వ్యవసాయాధికారి శ్రీజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం కింద మహిళ రైతులు ఈనెల 22 లోపు దరఖాస్తులు కొయ్యుర్ వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

ఈ పథకంలో రోటవేటర్స్-5, కల్టివేటర్/ కేజీ వీల్స్/డిస్క్ హార్రో -7,బ్యాటరీ స్ప్రేయర్స్ – 90,పవర్ ఆపరేటర్స్ స్ప్రేయర్స్  – 22,బ్రష్ కట్టర్- 2,వరి గట్లు వేసే మెషిన్ -1,విత్తనం, ఎరువులు వేసే మెషిన్ – 1,పవర్ టిల్లర్ – 1,వరి గడ్డి కట్టే మెషిన్ – 2 అని తెలిపారు.భూమి కలిగిన మహిళా రైతులు అప్లికేషన్ ఫామ్,ఆధార్ కార్డు,పట్టా పాస్ బుక్ జిరాక్స్ ,ట్రాక్టర్ కి సంబంధించిన వస్తువు కొనుగోలుకు ట్రాక్టర్ ఆర్సి డీటెయిల్స్,పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంబంధిత పత్రాలు జత చేసి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం కొయ్యూరు లేదా,తాడిచర్ల కార్యాలయంలో ఇవ్వాలన్నారు. మండల  రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -