మండల ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
2025-26 సంవత్సరానికి అమలు చేస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్లో భాగంగా రెండు పాడి గేదెల పథకం కొరకు ఈనెల16 గడువులోగా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని మండల ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్థాయి లక్ష్యాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు.
కావున అర్హత ఆసక్తి గల సిడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 16 లోపు https:/Agobmms.cgg.gov.in సైట్ నందు దరఖాస్తు చేసుకుని అట్టి దరఖాస్తు ఫారంను మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన పత్రాలు-ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్” ఫుడ్ సెక్యూరిటీ కార్డ్కుల ధృవీకరణ పత్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేయబడింది. ఆదాయ ధృవీకరణ పత్రం, పట్టాదార్ పాసుపుస్తకం,వికలాంగులైతే సదరమ్ సర్టిఫికేట్ పాస్పోట్ సైజ్ ఫొటోలు సమర్పించాలని తెలిపారు.



