Sunday, September 28, 2025
E-PAPER
Homeకరీంనగర్రైతు బీమా కోసం దరఖాస్తులు ఇవ్వండి 

రైతు బీమా కోసం దరఖాస్తులు ఇవ్వండి 

- Advertisement -

– మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ 
నవతెలంగాణ-రామగిరి 

రామగిరి మండలంలోని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది భూభారతి పోర్టర్ లో డిజిటల్ సైన్ చేసుకొని పట్టాలు పొందిన 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని రామగిరి మండల వ్యవసాయ అధికారి (ఏఓ) చిందం శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఓ శ్రీకాంత్ మాట్లాడుతూ,రైతు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్, రైతు బీమా దరఖాస్తు ఫారం దరఖాస్తులను రైతు స్వయంగా వచ్చి 12, 08, 2025 తేదీలోగా  మండలంలోని అందుబాటులో ఉన్న రైతు వేదికల్లో అందజేయాలని సూచించారు.ఇంతక ముందు నమోదు చేసుకున్న రైతులు ఏమైనా సవరణ ఉంటే సరిచేసుకోవాలని ప్రమాదవశాత్తు నామిని చనిపోయిన కొత్త నామినేని మార్పు కోసం వ్యవసాయ విస్తీర్ణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకం నుండి ఇంతకుముందు నమోదు చేసుకుని రైతులకు కూడా పూర్తి వివరాలతో సంబంధిత రైతు వేదికల్లో సంప్రదించాలని, ఏఓ మండల రైతులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -