జిల్లా విద్యాధికారి విజయలక్ష్మీ
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
TOSS (Telangana Open School Society) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల (2025–26 విద్యా సంవత్సరం) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఓపెన్ స్కూల్ ద్వారా చదువును కొనసాగించే అవకాశం వదిలిపెట్టిన వారికి తిరిగి విద్యను పొందే మార్గం అందుబాటులో ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం 17 టాస్ సెంటర్లు (స్కూల్స్ మరియు కళాశాలలు) ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సెంటర్లలో విద్యార్థులకు సహాయ సూచనలు, పాఠ్యపుస్తకాలు మరియు పాఠ్య సహాయం అందించబడుతుంది. జిల్లాలో మొత్తం 1780 మంది విద్యార్థులకు అవకాశం కల్పించబడగా, నేటి తేదీ వరకు 1086 మంది మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించారు. ఆసక్తి గల వారు వయసు తో సంబంధం లేకుండా 23 లోపు తమ దరఖాస్తులను పూర్తి చేయాలని, ఆలస్యం చేయకుండా వెంటనే www.telanganaopenschool.org వెబ్‌సైట్ లో నమోదు చేసుకోని ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని తెలిపారు.సంబంధిత విద్యా శాఖాధికారులు, ప్రిన్సిపల్స్, హెడ్మాస్టర్లు మరియు సెంటర్ ఇన్‌చార్జీలను సూచిస్తూ, ఎవరూ కూడా ఈ అవకాశాన్ని కోల్పోకుండా ప్రతి అర్హ విద్యార్థి దరఖాస్తు చేయాలని కృషి చేయాలని కోరారు.