జకాత్ ట్రస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి నిరంజన్ అలీ
నవతెలంగాణ – మిర్యాలగూడ
రెండు సంవత్సరాల ఇంటర్ విద్యను ఉచితంగా పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జకాత్ ట్రస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి నిరంజన్ అలీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కళాశాలలో రెండు సంవత్సరాల కార్పొరేట్ తరహాలో విద్యాబోధన పొందినందుకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 నుంచి జనవరి 15 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ట్రస్టు నిర్వహించే ప్రతిభ పరీక్షలు ఉత్తీర్ణత అయిన వారికి రెండు సంవత్సరాల ఉచిత విద్యతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పించబడుతుందన్నారు. కళాశాలలో బైపీసీ ఎంపీసీ ఎంఈసి కోర్సులు అందుబాటులో ఉన్నాయని దీనితోపాటు ఐఐటి, జేఈఈ, నిట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పేద ముస్లిం విద్యార్థులతో పాటు ముస్లిమేతర విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 9866556886 లకు సంప్రదించాలని కోరారు.
ఉచిత విద్యకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


