Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సకాలంలో నట్టల నివారణ మందులు వేయించాలి

సకాలంలో నట్టల నివారణ మందులు వేయించాలి

- Advertisement -

– ఉప్లూర్ సర్పంచ్ యెనుగందుల శైలేందర్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రైతులు తమ మేకలు, గొర్రెలకు సకాలంలో నట్టల నివారణ మందులు వేయించాలని ఉప్లూర్ సర్పంచ్ యెనుగందుల శైలేందర్ అన్నారు. గురువారం మండలంలోని ఉప్లూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ యెనుగందుల శైలేందర్ 

ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ మేకలు, గొర్రెలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు సకాలంలో నటల నివారణ ద్రావణాన్ని తాగించాలన్నారు. రైతుల సౌకర్యం ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తున్న నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు సకాలంలో నట్టల నివారణ మందులు వేయించడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి అన్నారు.ఈ శిబిరంలో 2784 గొర్రెలకు, 314 మేకలకు నట్టల నివారణ ద్రావణాన్ని వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  పశు వైద్య సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర స్పరన్, యాదవ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -