Thursday, May 29, 2025
Homeతెలంగాణ రౌండప్రెగ్యులర్ కంట్రోలర్ ను నియమించండి ..

రెగ్యులర్ కంట్రోలర్ ను నియమించండి ..

- Advertisement -

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – దుబ్బాక 
: బస్టాండ్ లో బస్సుల రాకపోకల సమాచారం ఇవ్వాల్సిన కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రెగ్యులర్ కంట్రోలర్ ను నియమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం దుబ్బాక బస్ డిపోలో ఏడీసీ వీ.ఎస్.సత్యనారాయణకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కంట్రోలర్ లేక ప్రయాణికులు బస్సుల సమాచారం తెలుసుకోలేకపోతున్నారని, అలాగే నైట్ డ్యూటీ వాచ్ మెన్ లేక బస్టాండ్ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెగ్యులర్ కంట్రోలర్, నైట్ డ్యూటీ వాచ్ మెన్ లను నియమించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వారి వెంట సీపీఐ(ఎం) దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, నాయకులు ఎండీ.సాజిద్, లక్ష్మీ నర్సయ్య, ఎల్లం, శ్రీనివాస్ పలువురున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -