Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'సర్‌' నిర్వహణకు బీఎల్‌వో, బీఎల్‌ఏలను నియమించండి

‘సర్‌’ నిర్వహణకు బీఎల్‌వో, బీఎల్‌ఏలను నియమించండి

- Advertisement -

సీఈవో సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నుంచి బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వో), బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)లను నియమించడానికి చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ‘సర్‌’ పై నిర్వహించిన సమావేశంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బి వినోద్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌, లీగల్‌ సెల్‌ నేత లలితారెడ్డితోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల తరఫున బీఎల్‌వోలను సరైన విధంగా నియమించకపోవడం వల్ల కలిగే సమస్యలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ‘సర్‌’ ప్రక్రియలో రాజకీయ పార్టీల నుంచి బీఎల్‌వో, బీఎల్‌ఏలు లేకపోతే అనేక పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశముందని వివరించారు. ఈ విషయంపై సుదర్శన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని ప్రతి వార్డులో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బీఎల్‌వో, బీఎల్‌ఏలను నియమించే అంశంపై ప్రత్యేకంగా అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -