- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్‌లో విద్యార్థినులకు మరింత మెరుగైన పర్యవేక్షణ, భద్రత, శ్రేయస్సు కల్పించేందుకు అడిషనల్ మహిళా చీఫ్ వార్డెన్ ల ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఆదేశాల మేరకు నియమించినట్లు ఆర్జీయూకేటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళిదర్షన్ శనివారం ఒక్క ప్రకటనలో తెలిపారు. పియుసి గర్ల్స్ విభాగానికి డాక్టర్ సుజాత, ఇంజనీరింగ్ గర్ల్స్ విభాగానికి శ్రీవిద్య లను అడిషనల్ మహిళా చీఫ్ వార్డెన్లుగా నియమించమని పేర్కొన్నారు.
ఈ నియామకాల ద్వారా విద్యార్థినుల పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, వార్డెన్ల సహకారంతో హాస్టళ్ల నిర్వహణలోనాణ్యతను పెంపొందించేలాచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
- Advertisement -