Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన బంజారా సేవా సంఘం అధ్యక్షుల నియామకం 

నూతన బంజారా సేవా సంఘం అధ్యక్షుల నియామకం 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో భీంగల్ యువజన సంఘం అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు భీంగల్ పట్టణ కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో యువజన జిల్లా అధ్యక్షులు మూడ్ ఇంధల్ నాయక్ ఆధ్వర్యంలో భీంగల్ నూతన యూత్ మండల అధ్యక్షులకు, కార్యవర్గానికి జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు. భీంగల్ మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షులుగా మలావత్ సంతోష్ నాయక్ దేవన్పల్లి తండా, అధ్యక్షులుగా పాలిత్య శివ నాయక్ సంతోష్ నగర్ తండా, ప్రధాన కార్యదర్శిగా ఆకాష్ నాయక్ కారేపల్లి తండా,కోశాధికారిగా భూక్య గణేష్ నాయక్ పెద్దమ్మకాడి తాండ, ఉపాధ్యక్షులుగా శేఖర్ నాయక్ సంతోష్ నగర్ తండా, జాయింట్ సెక్రటరీగా మూడ్ నవీన్ నాయక్ సుదర్శన్ నగర్ తండా, సలహాదారులుగా మాలావత్ సుమన్ నాయక్ దేవన్పల్లి తండా ఎన్నుకొబడ్డారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఎల్లవేళలా బంజారా సమాజానికి తమ వంతుగా మంచి పనుల కోసం పోరాడుతానని యువజన అధ్యక్షులు ఇందల్ నాయక్, జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్ కార్యవర్గంలో పనిచేస్తానని రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ నేతృత్వంలో ముందుకు సాగుతామని, మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు బాదావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. జిల్లా కోశాధికారి బానోత్ శ్రీరామ్ నాయక్, జిల్లా యువజన ఉపాధ్యక్షులు అనిల్ నాయక్, కేతావత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -