నవతెలంగాణ – నసురుల్లాబాద్
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోని చారిత్రాత్మక శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయ కమిటీని ఎండోమెంట్ అధికారు నియమించారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దుర్కి సోమలింగేశ్వరాల యానికి ఆలయ ధర్మకర్తల మండలి నూతన సభ్యులను నియమించామని అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీ సభ్యులు ప్రభుత్వ పరంగా ఎన్నికైన సభ్యులు మహేష్, భానుప్రియ, హరిప్రసాద్, సాయన్న, శ్రీనివాస్ తదితరులతో ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ ఇన్స్ పెక్టర్ కమల వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏఎంసీ ఛైర్ప ర్సన్ శ్యామల, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం శంభురెడ్డి ఆలయ భాక్తులు తదితరులు పాల్గొన్నారు.
సోమలింగేశ్వర ఆలయ కమిటీ నియామకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



