నవతెలంగాణ – భిక్కనూర్
దక్షిణ కాశీ శ్రీ సిద్ధరామేశ్వర ఆలయ పునర్నిర్మాణ నూతన కమిటీ నియామక పత్రాన్ని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ గురువారం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన 14 మందిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. చైర్మన్‌గా లింబాద్రి, వైస్ ఛైర్మెన్ దయాకర్ రెడ్డిలను నియమించారు. ఈనెల 22వ తేదీ నాడు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని షబ్బీర్ అలీ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, సొసైటీ చైర్మన్ భూమయ్య, సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణ కమిటీ నియామకం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES