జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా
నవతెలంగాణ- మణుగూరు
శ్రీ సత్య సాయి ప్రత్యేక అవసరాల పాఠశాల నిర్వాహకుల సేవలను జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత ప్రశంసించారు. గురువారం మణుగూరు మండలం సంతోష్ నగర్ లోని సింగరేణి సేవా సమితి సహకారంతో సింగరేణి మాజీ ఉద్యోగి తణుకు దుర్గావర ప్రసాద్ నాగమణి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సత్యసాయి ప్రత్యేక అవసరాలు కలిగిన చెవిటి, ముగ పాఠశాలను జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనిన్, ఎంపీడీవో తెల్లూరి శ్రీనివాసరావు సందర్శించారు. పాఠశాల లో విద్యార్థిని విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు వసతి, విద్యాబోధన, కళలు క్రీడలలో విద్యార్థుల ప్రతిభను, పురోగతిని సాధించిన అవార్డులను పరిశీలించడంతోపాటు ప్రత్యేకించి విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన స్పీచ్ థెరపీ నీ తద్వారా వారు మాట్లాడే తీరును ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఉపాధ్యాయుల సేవలను ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధికి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు టి నాగమణి, దుర్గా వరప్రసాద్, ఉపాధ్యాయురాలు రోజా రమణి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ సత్య సాయి పాఠశాలకు ప్రశంసలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES