నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 8న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పీ. శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్ధులు ఆన్ లైన్ https://www.apprenticeshipindia.gov.in/met Registrafico ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్ధులు మేళాకు వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీ, ఆధార్ కార్డు, ఎస్ఎస్.సి మెమో, కులం, ఐటీఐ పాస్ సర్టిఫికేట్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. అప్రెంటిషిప్ కల్పించడానికి డైనమిక్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, ఐటీసీ ఫుడ్ డివిజన్, హైదరాబాద్, రాణీ ఇంజిన్ వాల్స్ లిమిటెడ్, హైదరాబాద్, ఆర్టీసీ, ఎల్.జీ ఇతర కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అప్రెంటిషిప్ షిప్ 1961,209 ప్రకరంగా స్టైఫండ్ ను శిక్షణ కాలంలో నేరుగా అభ్యర్ధుల అకౌంట్ లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలో ఉన్న ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మేళాలో పాల్గొని అప్రెంటిషిప్ పొందాలని సూచించారు.
8న ఐటీఐ కళాశాలలో అప్రెంటిషిప్ మేళా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES