కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 18 జిల్లాల పరిధిలో నాలుగు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 894 కిలో మీటర్ల రైల్వే నెట్‌వర్క్ పెరుగుతుందని పేర్కొంది. 2030-31 నాటికల్లా పూర్తవనున్న ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 24,634 కోట్లుగా తెలిపింది. మహారాష్ట్రలోని వార్ధా – భూసావాల్ – మూడు, నాలుగు లైన్ – 314 కిలోమీటర్లు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో గోండియా – డోంగర్ గఢ్ – నాలుగో లైన్ – 84 కిలోమీటర్లు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో వడోదర – రత్లాం – మూడో, నాలుగో లైన్ – 259 కిలోమీటర్లు, మధ్యప్రదేశ్‌లో ఇటార్సీ – భోపాల్ – బీనా నాలుగో లైన్ -237 కిలోమీటర్లు నిర్మిస్తారు.
నాలుగు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం
- Advertisement -
- Advertisement -