Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడు సహకార సంఘాలకు గోదాముల నిర్మాణానికి ఆమోదముద్ర..

మూడు సహకార సంఘాలకు గోదాముల నిర్మాణానికి ఆమోదముద్ర..

- Advertisement -

జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో మూడు సహకార సంఘాలకు సంబంధించి, గోదాములను నాబార్డ్ సహాయంతో నిర్మించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కోపరేటివ్ కమిటీ సమావేశం నిర్వహించగా.. ఆయన మాట్లాడారు.  జిల్లాలో గోదాముల సదుపాయం సరిపడినంత లేనందున భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గోదాములను నిర్మించేందుకు  వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ స్టోరేజ్ స్కీమ్ ద్వారా సహకార సంఘాలలో నిర్మించనున్నట్లు తెలిపారు. గోదాముల  నిర్మాణానికి  నాబార్డు నుండి ఆర్థిక సహాయం లభించనుందనీ,  జిల్లా లో రైలు రోడ్డు మార్గాలకు దగ్గరగా ఉండి గోదాముల  నిర్మాణానికి అవకాశం ఉంటుందన్నారు. వీటి ద్వారా దాదాపుగా 40 వేల మెట్రిక్ టన్నుల గోదాముల సౌకర్యం జిల్లాలో ఏర్పడి ఉన్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలోని డిస్టిక్ కోపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వీరారెడ్డి, డి సి ఓ శ్రీధర్, ఇతర కమిటీ సభ్యులు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -