యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో గోదాముల సదుపాయాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలోని డిస్టిక్ కోపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో గోదాముల సదుపాయం సరిపడినంత లేనందున భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గోదాములను నిర్మించనున్నారు. వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ స్టోరేజ్ స్కీమ్ ద్వారా సహకార సంఘములకు ఈ గోదాములను నిర్మించనున్నారు. దీని కొరకు నాబార్డు నుండి ఆర్థిక సహాయం లభించనుంది.
జిల్లాలో రైలు, రోడ్డు మార్గాలకు దగ్గరగా ఉండి గోదాముల నిర్మాణానికి అనువైన భూమిని కలిగి ఉన్న మూడు సహకార సంఘాలలో వీటిని నిర్మించనున్నారు. వీటి ద్వారా దాదాపుగా 40 వేల మెట్రిక్ టన్నుల గోదాముల సౌకర్యం జిల్లాలో అందుబాటులోకి రానున్నదనారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తక్కవ ధరలలో మందులు దొరికేoదుకు పిఎసిఎస్ లలో జన ఔషధీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారని డిసిఓ మురళి రమణ తెలిపారు.



