కామారెడ్డిలో పోలీస్‌స్టేషన్‌కు తరలించిన ఘటనపై హరీశ్‌రావు ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కామారెడ్డి జిల్లాలో రైతులను పోలీసు స్టేషన్‌కు తరలించిన ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే రైతులు నేరస్తులా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూమి కోసం పోరాడిన లగచర్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల రైతులపై అక్రమ కేసులు బనాయించి సంకెళ్లు వేశారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు బస్తా యూరియా కోసం పొలాలు వదిలి పోలీసు స్టేషన్లకు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితిని రైతన్న కు ఈ ప్రభుత్వం తెచ్చిందని విమ ర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతగాని పాలనతో రైతులను అరిగోస పెడుతున్నారని తెలిపారు. అన్నదాత లను నడిరోడ్డుకు ఈడ్చి వికృతానందం పొందుతున్నారని పేర్కొన్నారు. రైతు లను పోలీసు స్టేషన్లలో పెట్టి ఎరువులు పంపిణీ చేసే పరిస్థితులు తెచ్చిన రేవంత్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలి పోక తప్పదని హెచ్చరించారు. రైతు లను నేరస్తులుగా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టిన ఈ దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ సమాజం గమని స్తున్నదనీ, తగిన సమయంలో బుద్ధి చెబుతుందని తెలిపారు.
రైతులు నేరస్తులా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES