– 311 మందికి ఇండ్ల పట్డాలు, ఇందిరమ్మ ఇండ్లు
– నేడు ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా అందజేత
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు నేలమట్టమైన బాధితులకు స్థలంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి.. నిర్మాణ పనులు ప్రారంభించడానికి నాలుగు రోజుల వ్యవధి ఉండగానే ప్రభుత్వం పట్టాల పంపిణీకి పూనుకుంటోంది. ఈ నెల 15లోపు సామాజిక, ఆర్థిక సర్వే పూర్తిచేసి అర్హులను గుర్తించి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఈ నెల 1న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఓ వైపు సర్వే చేస్తూనే మరోవైపు స్థలాల కోసం అన్వేషించారు. వెలుగుమట్ల రెవెన్యూలోనే మొత్తం 350 మందికి బుధవారం పట్టాలు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. కలెక్టరేట్‌లో జరిగే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతున్నారు. మంగళవారం సాయంత్రానికే మంత్రుల పర్యటన, పట్టాల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైనా.. వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. కూల్చిన చోటే 311 మందికి ఒక్కొక్కరికీ 75 గజాల చొప్పున ఇండ్ల పట్డాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మరో 101 మందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ 311 మందికి వెలుగుమట్ల రెవెన్యూలోని అవే సర్వే నంబర్లలో కూల్చిన చోటే స్థలాలు పంపిణీ చేయనున్నారు. కూల్చిన చోటే ఇండ్ల స్థలం ఇవ్వటంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం), ఇతర పార్టీలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
కూల్చిన చోటే స్థలాలు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



