Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యా కమిషన్‌లో విద్యావేత్తలేరి?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలేరి?

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి : మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ విద్యాకమిషన్‌లో అసలైన విద్యా వేత్తలు ఏరని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యలో పీహెచ్‌డీ చేసిన ఒక్కరు కూడా లేకుండానే కొత్త విద్యావిధానం తయారు చేస్తారా?అని శుక్రవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. విద్యాశాఖ మీద కనీస అవగాహన లేని వారితో కమిటీ వేసి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు. గడిచిన రెండేండ్లుగా విద్యాశాఖను గాలికి వదిలేసి ఇప్పుడు లేని వారితో కమిటీ వేసి కాలయాపన చేస్తారా?అని ప్రశ్నించారు. కమిటీ ఇంత గొప్పగా ఉంటే వారిచ్చిన నివేదిక ఇంకెంత గొప్పగా ఉంటుందో అర్థమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే నిర్ణయాలు ఆపి తక్షణమే విద్యావేత్తలకు ఆ బాధ్యతలను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. విద్యా కమిషన్‌లో స్కూల్‌ పిల్లలకు గానీ, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్‌ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఎవరో చెప్పగలరా ముఖ్యమంత్రి?అని ప్రశ్నిం చారు. జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న ఇద్దరు ప్రొఫె సర్లు మినహా స్కూల్‌ సిలబస్‌ తయారీలో, కోర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో పట్టున్న వాళ్లు కానీ ఈ కమిటీలో ఒక్కరైనా ఉన్నారా?అని అడిగారు. ఈ కమిటీ చైర్మెన్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పైగా ఆయన ఇంజనీర్‌ అని తెలిపారు. కార్యాలయాలు నడపడం వేరు చదువులు చెప్పడం వేరని పేర్కొన్నారు. పరిపాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్టా?అని ప్రశ్నించారు. కొత్త విద్యా విధానం విషయంలో రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పారదర్శకతను కోరుకుంటున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -