చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్‌లో చిప్స్ ఒకటి. రకరకాల రంగుల కవర్స్‌తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చిప్స్‌ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు..
ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్ క్రమంగా దెబ్బతీస్తాయి. చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి చిప్స్ కారణంగా చెబుతున్నారు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఫైబర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో మలబద్ధకానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు తెలిపారు.
చిప్స్ తింటున్నారా…?
- Advertisement -
- Advertisement -