వయసు పైబడుతున్న కొద్దీ ఏదో ఒక ఆరోగ్య సమస్య వెన్నాడుతూనే ఉంటుంది. ముందు జాగ్రత్త ఉంటే.. కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవటం సులభమవుతుంది. వయసు పై బడుతున్నవారు రెగ్యులర్‌గా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణుల సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) : ఇది రక్త పరీక్ష. ఇందులో ఎర్ర రక్త కణాలు (ఆర్బీసీ), తెల్ల రక్త కణాలు (డబ్ల్యూబీసీ), రక్తంలోని ప్లేట్‌లెట్ల గురించి సమాచారాన్ని అందించే పరీక్షల సమాహారం. అలాగే రక్తంలో ఎన్ని రకాల కణాలు ఉన్నాయో కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) నిర్ణయిస్తుంది. మనిషి ఆరోగ్య స్థితి తెలుసుకోవటానికి ఇవి క్రమం తప్పకుండా చేయించుకుంటే మంచిది.
బేసిక్ మెటాబోలిక్ ప్యానల్ పరీక్ష : దీనినే బీఎంపీ పరీక్ష అని కూడా అంటారు. ఈ టెస్ట్ ద్వారా రక్తంలో ఎనిమిది రకాలైన పోషకాలు.. కాల్షియం, గ్లూకోస్, సోడియం, పొటాషియం, బైకార్బొనేట్, క్లోరైడ్, రక్తంలో యూరియా నైట్రోజెన్, క్రియేటినైన్ ఏ మోతాదులో ఉందో తెలుస్తుంది. ఈ పరీక్ష చేయించుకునే ముందు 8 గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఈ పరీక్షలో కిడ్నీ, మధుమేహం లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్టయితే వైద్యులు చెబుతారు.
లిపిడ్ పరీక్ష : ఈ లిపిడ్ పరీక్షకు 8 గంటలకు ముందు ఏమీ తినకూడదు. ఈ టెస్ట్‌తో కొలస్ట్రాల్ లెవల్స్ తెలుస్తాయి. పరీక్ష తరువాత రిపోర్ట్ నార్మల్‌గా లేకపోతే మీరు గుండె సంబంధిత వ్యాధి ఏమైనా ఉన్నదా అనేది వైద్యులు పరిశీలిస్తారు.
థైరాయిడ్ పరీక్ష : ఈ థైరాయిడ్ పరీక్ష ద్వారా శరీరంలో ప్రొటీన్ లెవెల్స్, థైరాయిడ్ స్థితిగతి ఎలా ఉందో తెలుసుకుంటారు.
సి-రియాక్టివ్ ప్రొటీన్ పరీక్ష : దీనినే సీఆర్‌పీ పరీక్ష అంటారు. ఈ సీఆర్‌పీ పరీక్షలో మీ సీఆర్‌పీ స్థాయి ఎక్కువగా ఉంటే మీరు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు. సీఆర్పీ స్థాయిలను బట్టి లుపస్, రుమటాయిడ్ అర్థిరైటిస్, క్యాన్సర్ లాంటి రోగాలను సూచిస్తుంది.
రక్త పరీక్షలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
రక్తం తీసే ప్రదేశాన్ని దూదితో శుభ్రం చేయాలి. నరాలు కనిపించే విధంగా చేయికి బ్యాండ్ చుట్టాలి. నర్సు రక్తాన్ని తీసుకున్న తరువాత కట్టిన బ్యాండ్‌ను తీసేసి రక్తం తీసిన ప్రదేశాన్ని దూదితో లేదా మెడికల్ టేప్‌తో కప్పివేయాలి. రక్త పరీక్ష చేయడానికి స్టెరిలైజ్డ్ సూది, శుభ్రమైన దూదిని మాత్రమే ఉపయోగించాలి. ఈ పరీక్షలను తప్పకుండా చేయించుకుంటే కొన్ని ముఖ్యమైన అనారోగ్యాన్నైనా ముందుగానే ఎదుర్కోవచ్చు.
వయసు పైబడుతుందా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



