Saturday, October 11, 2025
E-PAPER
Homeమానవిగ్యాస్‌ సమస్య వేధిస్తుందా..?

గ్యాస్‌ సమస్య వేధిస్తుందా..?

- Advertisement -

బయటి ఆహారం ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్‌, అసిడిటీ వస్తుంది. రుతువులు మారుతున్న కొద్దీ, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారి సమస్యలు కూడా పెరుగుతాయి. తప్పుడు ఆహారపు అలవాట్లే జీర్ణక్రియ బలహీనపడటానికి కారణమని, తద్వారా గ్యాస్‌ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సమస్య మొదలయ్యిందంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని అర్థం. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది బ్యాక్టీరియా ఏర్పడటానికి దారితీస్తుంది. అలాగే గ్యాస్‌ సమస్యలను కలిగిస్తుంది. దీని నుండి బయటపడాలంటే కొన్ని అలవాట్లు పాటించాలి.

నీరు తాగడానికి సమయం: ఆహారం తిన్న వెంటనే ఎప్పుడూ నీరు తాగకండి. ఆహారం తిన్న ఒక గంట తర్వాత మాత్రమే నీరు తాగాలి.
ఆహారాన్ని ఎలా నమలాలి: ఆహారాన్ని సరిగ్గా నమలాలి. ఆహారాన్ని కొద్దిగా నమిలి మింగితే, అది త్వరగా జీర్ణం కాదు. అలాగే అజీర్ణ సమస్యకు కారణమవుతుంది. కాబట్టి ప్రతి ముద్దను సరిగ్గా నమిలి తినాలి.
ఆహారంతో పెరుగు లేదా మజ్జిగ: అయితే శీతాకాలంలో ఈ అలవాటు జలుబు లేదా దగ్గుకు కూడా కారణమవుతుంది. మీరు రోజు భోజనంతో పాటు 1 గ్లాసు పలుచని మజ్జిగ తాగాలి. ఇది ప్రోబయోటిక్‌ పానీయం. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే గ్యాస్‌ సమస్యా తొలగిపోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -