Monday, October 13, 2025
E-PAPER
Homeమానవిబాధిస్తున్నాయా?

బాధిస్తున్నాయా?

- Advertisement -

వర్షాకాలం వచ్చిందంటే చాలు, వాతావరణంలో తేమ పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వీటిలో సాధారణంగా కనిపించే ఒక సమస్య కాలి వేళ్ళ మధ్య ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ లేదా పాదం పగుళ్లు. దీనివల్ల చాలాసార్లు కాలి వేళ్ళ మధ్య విపరీతమైన దురద వస్తుంది, చర్మం పగులుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు మీ కోసం…

ఆవాల నూనె, వెల్లుల్లి : 2-3 వెల్లుల్లి రెబ్బలను ఆవాల నూనెలో వేసి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను కాలి వేళ్ళ మధ్య రాయాలి. ఆవాలు, వెల్లుల్లిలో ఉండే యాంటీ-ఫంగల్‌, యాంటీ-బ్యాక్టీరియల్‌ గుణాలు పగుళ్లను, ఇన్‌ఫెక్షన్లను వేగంగా నయం చేస్తాయి. ఈ పద్ధతిని సాధారణంగా చాలా మంది ఉపయోగిస్తారు.
పసుపు, కొబ్బరి నూనె :
ఒక స్పూను పసుపులో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌గా చేసి, పగుళ్లు లేదా ఇన్‌ఫెక్షన్‌ ఉన్న చోట రోజుకు రెండుసార్లు రాయాలి. పసుపు ఇన్‌ఫెక్షన్లను తొలగిస్తుంది కొబ్బరి నూనె తేమను అందించి చర్మం పొడిగా మారకుండా చూస్తుంది.

మరిగించిన వేప ఆకుల నీరు : 10-15 వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో రోజుకు రెండుసార్లు పాదాలను కడగాలి. వేపకు శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు ఉన్నాయి, ఇవి చర్మ సమస్యలను దూరం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -