Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాలానగర్‌ భూములపై హౌజ్‌ కమిటీకి సిద్ధమా?

బాలానగర్‌ భూములపై హౌజ్‌ కమిటీకి సిద్ధమా?

- Advertisement -

బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్న
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఏమైంది?
కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో భూ వ్యవహారాలపై హౌజ్‌కమిటీకి సిద్ధమా?అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు బీఆర్‌ఎస్‌ సభ్యులు సహకరించాలనీ, సభా మర్యాదలు పాటించాలని స్పీకర్‌ పదేపదే కోరినా మార్పు రాలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. సూచనలు చేయడం, పారిపోవడం బీజేపీ సభ్యులకు అలవాటైపోయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారిందనీ, రూ.వేల కోట్లు దోచుకుందంటూ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఆరోపించే వారని గుర్తు చేశారు. సీబీఐకి ఆ కేసును అప్పగిస్తే కేసీఆర్‌, హరీశ్‌రావును 48 గంటల్లో జైల్లో వేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారని వివరించారు. ఆ మాటలు నమ్మి కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించామన్నారు. 48 గంటలు కాదు ఎన్ని నెలలు గడిచిందో అందరూ చూశారని అన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టారని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకున్నాయని చెప్పారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్‌, హరీశ్‌రావులను జైల్లో పెట్టిన తర్వాతే బీజేపీ సభ్యులు తమకు సూచనలివ్వాలని కోరారు. అప్పుడే వారి మాట వింటామని అన్నారు. గత ప్రభుత్వంలో ధరణిని అడ్డుపెట్టుకుని మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో ఓ ప్రయివేటు కంపెనీ యజమానిని బెదిరించి బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు తమ్ముడు మహేశ్‌రావు, మామ హనుమంతరావు, బావమరిది సుమన్‌రావులు అక్రమంగా వందల ఎకరాలను ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై సభాసంఘం వేస్తామనీ, దీనికి బీఆర్‌ఎస్‌ సభ్యులు సిద్ధమా?అని ప్రశ్నించారు. హరీశ్‌రావు కుటుంబ సభ్యులకు అక్రమంగా భూములను బదలాయించేందుకు రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకరించకపోవడం వల్లే ఆయనపై బురదజల్లుతున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -