Thursday, May 1, 2025
Homeమానవివేడిగా ఉందని రోజంతాఏసీలో కూర్చుంటున్నారా..

వేడిగా ఉందని రోజంతాఏసీలో కూర్చుంటున్నారా..

ఎండలు దంచికొడుతున్నాయి. ఎండా వేడిమి నుంచి తట్టుకునేందుకు చాలా మంది ఏసీలకు పనిచెప్పేస్తున్నారు. అయితే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా ఏసీల్లో ఉంటే కచ్చితంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఒబేసిటీ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. వాతావరణంలో మార్పులు, అధికంగా ఏసీ వినియోగం వంటివి తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రయోజనాలుగా మారుతాయని పేర్కొంటున్నారు.
శారీరక చురుకుదనం తగ్గిపోతుంది:
గదుల్లో గడిపే వ్యక్తులు ఎక్కువగా ఒకే చోట కూర్చుంటారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కాలరీల వినియోగం తగ్గిపోతుంది. దీని వలన తక్కువ సమయంలోనే బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. క్రమంగా అది ఒబేసిటీ, డయాబెటిస్‌ వంటి రోగాలకు దారి తీస్తుంది.
ఆహార అలవాట్లు మారిపోతాయి:
చల్లని వాతావరణం మనలో చిరుతిళ్లు తినాలనే ఆకాంక్షను పెంచుతుంది. ఆకలిలేని సమయంలోనూ మనం ఎదో ఒకటి తినే అవకాశం ఉంది. దీని ఫలితంగా, అవసరానికి మించి కాలరీలు తీసుకోవడం జరుగుతుంది. క్రమంగా మన శరీరంలో ఎక్కువ కొవ్వు పెరిగిపోవడం, బరువు పెరిగిపోవడం వంటివి జరుగుతాయి.
శాస్త్రీయ పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?
కొన్ని అధ్యయనాల ప్రకారం, ఏసీ వాతావరణంలో ఎక్కువసేపు ఉండే వ్యక్తులు, సగటు వ్యక్తుల కంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుందని గుర్తించారు. ఇది కాలక్రమేణా ఊబకాయం, డయాబెటిస్‌, హదయ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య సమస్యల ఛాన్సులను పెంచుతుందని చెబుతున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
– ఏసీ ఉన్నా చురుకుగా ఉండండి: ప్రతి అరగంటకు కనీసం 5 నిమిషాలు నడవడం లేదా చిన్న శారీరక కార్యకలాపం చేయడం మంచిది.
– ఆహారాన్ని నియంత్రించండి: ఆకలి లేకపోయినా చిరుతిళ్లు తినడం తగ్గించండి. ఆరోగ్యకరమైన ఆహారపు ఎంపికలు చేయండి.
– సహజమైన గాలి ప్రవాహాన్ని ప్రోత్సహించండి: సాధ్యమైనంతవరకూ ఏసీ అవసరం లేకుండా ఫ్యాన్‌లు లేదా సహజ గాలి ద్వారా శరీరాన్ని చల్లబరచుకునే ప్రయత్నం చేయండి.
– ఏసీ ఉష్ణోగ్రతను మితంగా ఉంచండి: ఏసీని చాలా చల్లగా ఉంచకుండా, 24-26 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మధ్య ఉంచడం ఆరోగ్యానికి మేలుగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img