Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్తరోడలో త్రాగు నీటి కోసం రాస్తారోకో..

తరోడలో త్రాగు నీటి కోసం రాస్తారోకో..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో త్రాగు నీటి కోసం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో వర్షంలోనే శనివారం ఉదయం  జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తమ ఎస్సీ కాలనీ లో గత పది రోజులుగా త్రాగు నీరు రావడం లేదని కాలనీ వాసులు పలుమార్లు గ్రామపంచాయతీ సిబ్బంది కీ దృష్టికి తీసుకవచ్చిన పట్టించుకోకపోవడంతో స్థానిక ముధోల్, బాసర జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

తమ కాలనీ కీ బోరు బావి చేడి పోయి రోజులు గడుస్తున్నా.. ఏవరూ పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. తక్షణమే బోరు బావికి మరమ్మతులు చేయించి, త్రాగు నీటిని అందిచాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ ఎస్సై బిట్ల పెర్సెస్ వెంటనే తన పోలిస్ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. ఆందోళన కారులతో పోలీసులు మాట్లాడారు. త్రాగు నీటి సమస్య పరిష్కరించే విధంగా సంబందిత అధికారులకు తెలియజేస్తామని వారు తెలిపారు. దీంతో కాలనీవాసులు రాస్తారోకోను విరమించారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పోలీసులు క్లియర్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad