Wednesday, January 21, 2026
E-PAPER
Homeక్రైమ్సికింద్రాబాద్ లో ఆర్మీ వాహనం బీభత్సం

సికింద్రాబాద్ లో ఆర్మీ వాహనం బీభత్సం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని ఆర్మీ వాహనం ఢీకొంది. దీంతో విద్యార్థి ఆర్మీ ట్రక్కు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న బాలుడి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికులను అడిగి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -