Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి : డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు

ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి : డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం రూ.1300 కోట్ల ఆరోగ్య శ్రీ పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను ఒక ట్రిలియన్‌ ఎకానమీగా మార్చుతామని చెబుతున్నారనీ, ఆరోగ్యం అందులో భాగమా? కాదా? అని ప్రశ్నించారు. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో 80శాతం మంది రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారనీ, 20 శాతం మందే ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్నారని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రాణాలకు గ్యారెంటీ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమంది పేదలు రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వైద్యాన్ని పొందారో చెప్పాలని నిలదీస్తే సర్కారు వద్ద సమాధానమే లేదని విమర్శించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 100 పడకల ఏర్పాటు హామీ నీటిమీది రాతలా మారిందన్నారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad