Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని దాచారం గ్రామంలో బతుకమ్మ,దసరా వేడుకలకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు భైర సంతోశ్ సోమవారం ప్రత్యేక చొరవ చూపి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాల నుండి చెక్ డ్యాం,పురాతన పాఠశాల నుండి త్రాగు నీరు బావి వరకు పంచాయతీ సిబ్బంది సహాకారంతో రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగిన చెట్లను తొలగించి రోడ్డుపై ఏర్పడిన గుంతలకు మట్టితో చదును చేయించి వీధీ దీపాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి సురేశ్ పనులను పర్యవేక్షించారు.ప్రజల సౌకర్యార్థం చేపట్టిన మరమ్మతుల పనులకు సహాకరించిన పంచాయతీ సిబ్బందికి భైర సంతోశ్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -