Tuesday, March 31, 2026
E-PAPER
Homeఖమ్మంపదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

– ఎంఈఓ ప్రసాదరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

త్వరలో జరగనున్న పదోతరగతి పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసామని ఎంఈవో ప్రసాదరావు తెలిపారు.ఆయన తన కార్యాలయంలో సోమవారం పదోతరగతి పరీక్షల ఏర్పాట్లపై విలేకరుల తో మాట్లాడారు.

మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఆరు ఆశ్రమ పాఠశాల లు, మూడు గురుకులాలు, నాలుగు ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 19 పాఠశాలల నుండి 704 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు అని తెలిపారు. 

వీరిలో 651 మంది అశ్వారావుపేట మండలంలోని మూడు పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు రానున్నారు అని, అశ్వారావుపేట మండలం భీముని గూడెం ఆశ్రమ పాఠశాలకు చెందిన 53 మంది విద్యార్థులు దమ్మపేట మండలంలో గొల్లగూడెం పరీక్ష కేంద్రంలో హాజరవుతున్నారు అన్నారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) పరీక్ష కేంద్రం లో 300 మంది, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రం లో 196 మంది, మండలం లోని సున్నం బట్టి ఆశ్రమ పాఠశాల పరీక్ష కేంద్రం లో 155 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు  హాజరవుతున్నారు అని తెలిపారు.

వీరందరికీ తగిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని, పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ,పరీక్షల సందర్భంగా విద్యార్థులకు త్రాగునీరు, ప్రధమ చికిత్స మొదలగునవి అందుబాటులో ఉంచడం జరుగుతుంది అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -