Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు…

గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు…

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
గణేష్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ-14వ సర్కిల్ ఆధ్వర్యంల్ పరిధిలో భారీ ఏర్పాట్లు చేపడుతు న్నట్లు గోషామహల్ సర్కిల్+14 డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్ అన్నారు.  అబిడ్స్ లోని  జిహెచ్ఎంసి  కార్యాలయంలో గణేష్ ఉత్సవ సమితి నాయకులు, పలువురు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సర్కిల్ పరిధిలో ఏ ప్రాంతంలోనైనా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తెస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. భక్తులకు,ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి నాయకులు గోవింద్ రాఠి, శ్రీరామావ్యాస్, నట్రాజ్ ,, మెట్టు వైకుంఠం , ఏ  ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ , యు సి డి పి ఓ లక్ష్మీబాయి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -