నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా రోజున నిర్వహించే రావణ దహన కార్యక్రమాన్నికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని, దసరా ఉత్సవాలకు జంబి ఆకు గుడిలో పూజా ఏర్పాట్లు తదితర పనులు పూర్తయినట్లు చైర్మన్ చింతల రవితేజ గౌడ్, అధ్యక్షులు గోవర్ధన్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కళాకారులచే ఆటపాట కార్యక్రమాలు, రంగురంగుల టపాసుల ప్రదర్శన, అనంతరం రావణ దహనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో ఉత్సవ కమిటీ సభ్యులు అశోక్ రెడ్డి, రమేష్ గౌడ్, శ్యామ్, ప్రకాష్, నరేష్ రెడ్డి, స్వామి, నిస్సీ, ప్రవీణ్ పాల్గొన్నారు.