Thursday, November 27, 2025
E-PAPER
Homeఖమ్మంనామినేషన్ ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

నామినేషన్ ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

– 8 కేంద్రాల్లో నామినేషన్ లు స్వీకరణ
– ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఈ నెల 30 వ తేదీ నుండి జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో అప్పారావు తెలిపారు. మండల వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల నుండి నామినేషన్ల స్వీకరణకు 8 కేంద్రాలు సిద్దం చేశామని అన్నారు.స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని నారం వారి గూడెం కాలనీ,జమ్మి గూడెం,ఊట్లపల్లి,అనంతారం,వినాయక పురం,తిరుమలకుంట,నందిపాడు,కన్నాయిగూడెం లోని ఆయా పంచాయితీ కార్యాలయాల్లో అభ్యర్ధుల నుండి నామినేషన్ స్వీకరిస్తామని తెలిపారు.
ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. నారం వారి గూడెం కాలనీ లో నారం వారి గూడెం కాలనీ,నారం వారి గూడెం,పాతల్లిగూడెం 3 పంచాయితీలు, జమ్మి గూడెం లో జమ్మి గూడెం,మద్ది కొండ,అచ్యుతాపురం 3 పంచాయితీలు, ఊట్లపల్లి లో ఊట్లపల్లి,వేదాంత పురం,కేసప్పగూడెం 3 పంచాయితీలు, అనంతారం లో అనంతారం,రామన్నగూడెం,గాండ్లగూడెం,మల్లాయిగూడెం 4 పంచాయితీలు, వినాయక పురంలో ఆసుపాక, వినాయకపురం,నారాయణపురం,బచ్చువారిగూడెం 4 పంచాయితీలు, తిరుమలకుంటలో కొత్తమామిళ్ళవారిగూడెం,తిరుమలకుంట,పాతరెడ్డిగూడెం,మొద్దులమడ,దిబ్బగూడెం 5 పంచాయితీలు,నందిపాడు లో నందిపాడు,కోయ రంగాపురం,గుమ్మడి వల్లి 3 పంచాయితీలు, కన్నాయిగూడెం లో కన్నాయిగూడెం,కావడి గుండ్ల 2 పంచాయితీల సర్పంచ్,వార్డ్ మెంబర్ లకు సంబంధించిన నామినేషన్ లు స్వీకరిస్తామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -