Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ కు ఏర్పాట్లు..

ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ కు ఏర్పాట్లు..

- Advertisement -

భవనాలు, విద్యుత్ వినియోగంపై సర్వే..
కార్యాచరణకు కమీషనర్,విద్యుత్ అధికారుల  సన్నాహక సమావేశం..
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ తో సాదారణ విద్యుత్ వినియోగం తగ్గింపు,విద్యుత్ వ్యయం తగ్గింపునకు ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యుత్ శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల మండల స్థాయిలో అధికారులు కార్యాచరణ రూపొందించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశానుసారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచనలు మేరకు బుధవారం మున్సిపల్ కమీషనర్ నాగరాజు, విద్యుత్ ఏడీఈ వెంకటరత్నం సన్నాహక సమావేశం నిర్వహించారు.

మునిసిపాలిటి పరిధి లోగల ప్రభుత్వ భవనాలు,ఆయా కార్యాలయాల్లో గత ఆరునెలలు గా విద్యుత్ వినియోగం,భవనాలు పైన వైశాల్యం తో పలు అంశాలతో కూడిన సర్వే చేసి నివేదిక రూపొందించనున్నట్లు కమీషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజినీర్ శివశంకర్,ఏవో శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img