Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి…

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. బుధవారం రోజు కలెక్టర్ ఛాంబర్ లో అన్ని శాఖల అధికారులతో  కలెక్టర్ సమీక్ష జరిపారు. జూన్ 2న జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలు చేస్తున్న  రాజీవ్ యువ వికాసం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, వ్యవసాయం, వైద్యారోగ్యం  శాఖ ల నివేదిక వివరాలు  తెలపాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మినారాయణ,డీఆర్డీఓ నాగిరెడ్డి, , కలెక్టరేట్ ఏ.ఓ జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -