మూడు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు
ఆరు జూనియర్ కళాశాలల విద్యార్థులు
ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 25 వ తేదీ బుధవారం నుండి మార్చి 17 వ తేదీ మంగళవారం వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సార్వత్రిక పరీక్షలు కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ప్రభుత్వం జూనియర్ కళాశాల,వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాల, మైనారిటీ బాలికల జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన మూడు పరీక్ష కేంద్రాల్లో అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని మొత్తం ఆరు(6) జూనియర్ కళాశాలల నుంచి ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులు మొత్తం 1493 మంది పరీక్షలు రాస్తున్నారు.
ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు అనిత,సంగీత, శేషుబాబు,పుల్లమ్మ, సీతారాం, వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మొదటి సంవత్సరం 67,ద్వితీయ సంవత్సరం 46 మొత్తం 113, వ కేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాల నుండి మొదటి సంవత్సరం 328,ద్వితీయ సంవత్సరం 275 మొత్తం 603, మైనారిటీ బాలికల జూనియర్ కళాశాల నుండి ప్రధమ సంవత్సరం 66,ద్వితీయ సంవత్సరం 57 మొత్తం 123, దమ్మపేట మండలం అంకంపాలెం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల నుండి ప్రధమ సంవత్సరం 154,ద్వితీయ సంవత్సరం 144,మొత్తం 298, దమ్మపేట ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలురు జూనియర్ కళాశాల నుండి ప్రధమ సంవత్సరం 133,ద్వితీయ సంవత్సరం 93,మొత్తం 226, మందలపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలురు జూనియర్ కళాశాల నుండి మొదటి సంవత్సరం 49,ద్వితీయ సంవత్సరం 81,మొత్తం 130.నియోజక వర్గంలోని రెండు మండలాల నుంచి 1493 మంది పరీక్షలు రాస్తున్నారు.
ప్రభుత్వం జూనియర్ కళాశాల,వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాల, మైనారిటీ బాలికల జూనియర్ కళాశాలల పరీక్షా కేంద్రాలు కు డిపార్ట్మెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్ లు గా కోళ్ల శ్రీనివాస్ రావు,చింతా సత్య శ్రీధర్, ఝాన్సీ, సంగీత,లోల్ల శివసాయి ప్రసాద్, బీ.రాంబాబు లు విధులు నిర్వహిస్తారు.



