Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీఎం పర్యటనకి ఏర్పాట్లు చేయాలి..

సీఎం పర్యటనకి ఏర్పాట్లు చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
నూతన రేషన్ కార్డులు ప్రారంభించుటకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఏప్రియల్ 14 న తిరుమలగిరి కి విచేస్తున్న సందర్బంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సి యం పర్యటనకి సంబంధించి అధికారులకి కేటాయించిన భాద్యతలు సక్రమంగా నిర్వహించి సి యం పర్యటనని విజయవంతం చేయాలని సూచించారు.అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ధరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి, వేగవంతంగా ఆర్జిదారులకి సరియైన సమాధానం ఇవ్వాలని సూచించారు.

ప్రజావాణి దరఖాస్తులలో భూ సమస్యల పై 47, ఎంపిడిఓ లకి 13,డి పి ఓ 10,శాఖలకు సంబందించినవి 25 మొత్తం 95 మొత్తం ధరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబందిత అధికారులకి పంపించటం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు, డి పి ఓ యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,డి ఈ ఓ అశోక్, సి పి ఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad