Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలి

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలి

- Advertisement -

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని
నవతెలంగాణ – భూపాలపల్లి

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని తెలిపారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీమతి రాణి కుమిదిని ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ తదితర అంశాలపై సమీక్షించారు. భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయం నుండి సబ్ కలెక్టర్  మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు  అశోక్ కుమార్, శ్రీమతి విజయలక్ష్మి,  ఏఎస్పి  నవీన్ కుమార్, డిపిఓ శ్రీమతి శ్రీలత, డిపిఆర్వో శ్రీనివాస్, సీపీఓ  బాబురావు తదితర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

జిల్లాలో 6 జడ్పిటిసి మరియు 58 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని సబ్ కలెక్టర్  మయాంక్ సింగ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఎంపీడీవో కార్యాలయంలోనే జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు.జిల్లాలో ఎంపిటిసి ఎన్నికల కోసం 19 రిటర్నింగ్ అధికారులను, జడ్పిటిసి ఎన్నికల కోసం 6 రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్ ఓ, ఏ ఆర్ ఓ లకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసినట్లు  తెలిపారు.నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు సబ్ కలెక్టర్  మయాంక్ సింగ్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -