ఎంపీడీవో కు వినతి పత్రాన్ని అందజేసిన ఉపాధి హామీ సిబ్బంది
నవతెలంగాణ – పాలకుర్తి
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఏపీ ఓల తో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు గత ఐదు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, బకాయి వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధి హామీ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి హామీపై బుధవారం జరిగిన సమీక్ష సమావేశాన్ని ఉపాధి హామీ సిబ్బంది బహిష్కరించారు. బకాయి వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో ఎస్ రవీందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ సిబ్బంది మాట్లాడుతూ ఏపీఓలకు మూడు నెలలుగా, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ అమలులో సిబ్బందితో పనులు చేయించుకుంటున్నారు తప్ప వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ సిబ్బందిని ఆదుకునేందుకు బకాయి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అంబాల మంజుల, టెక్నికల్ అసిస్టెంట్లు కుమార్, శ్రీనివాస్, ఇంద్రయ్య లతోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ఉపాధి హామీ సిబ్బందికి బకాయి వేతనాలు చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES