Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నిందితుల అరెస్టు

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నిందితుల అరెస్టు

- Advertisement -

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న మోకిలా పోలీసులు
నిందితుల్లో రైల్వే, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు
నవతెలంగాణ-శంకర్‌పల్లి

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురుని మోకిలా, ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రైల్వే ఉద్యోగి, సాప్ట్‌వేర్‌ ఉద్యోగితోపాటు వ్యాపారి ఉన్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మోకిలా పీఎస్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉద్యోగి పొన్నాల సిద్ధార్థ్‌, సాప్ట్‌వేర్‌ ఉద్యోగి హిమంత్‌ కృష్ణవంశీ, వ్యాపారి అవుదాట విష్ణుతేజ ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు బెంగళూరు, గోవా నుంచి ఖరీదైన కొకైన్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే లక్ష్యంగా కొకైన్‌ విక్రయిస్తున్నారు.

వీరు ముగ్గురు తమ సొంత కారులో మిర్జాగూడ నుంచి కొల్లూరు వెళ్తున్న క్రమంలో శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామం ఇంద్రారెడ్డినగర్‌ రోడ్డులో మోకిలా, ఎస్‌ఓటీ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. అనుమానం వచ్చి వీరి కారును ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 39.72 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. దాంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా.. గోవా నుంచి కొకైన్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో పార్టీలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. నిందితులపై ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు ఎవరెవరికి డ్రగ్స్‌ విక్రయించారనే విషయంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -