Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ కార్యకర్తల అరెస్ట్

అంగన్వాడీ కార్యకర్తల అరెస్ట్

- Advertisement -

హైదరాబాద్ ధర్నాకు తరలివెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలు, నిలిపివేసిన పోలీసులు
నవతెలంగాణ కాటారం

రాష్ట్ర స్థాయి డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్న ధర్నాకు తరలివెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలను మండలంలో పోలీసులు అడ్డుకుని కొందరిని అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం మండలంలోని పలు గ్రామాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కలిసి హైదరాబాద్‌కు వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు వారిని నిలిపివేశారు.
అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరైన స్పందన లభించలేదని వారు తెలిపారు. జీతాల పెంపు, సేవా నియమావళి అమలు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్లతో హైదరాబాద్‌లో జరిగే ధర్నాకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.
అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అనంతరం కొంతసేపటికి వారిని విడుదల చేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలని వారు కోరారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -