Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపాదయాత్ర కోసం రైతుల అరెస్ట్‌ అన్యాయం

పాదయాత్ర కోసం రైతుల అరెస్ట్‌ అన్యాయం

- Advertisement -

– బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పాదయాత్ర కోసం రైతులతో పాటు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఏ. జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదనీ, పాదయాత్రలో జనం ప్రశ్నిస్తారనే భయంతోనే అరెస్ట్‌లకు దిగారని విమర్శించారు. ఆర్మూర్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేనైన నాపైనే 40 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు నీటి పారుదల శాఖపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
భూ దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కాంగ్రెస్‌ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అన్ని విభాగాలు అవినీతిలో కూరుకు పోయాయనీ, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాటలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అరెస్ట్‌ చేసిన రైతులను, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad