Sunday, December 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టుల అరెస్టు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం

జర్నలిస్టుల అరెస్టు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం

- Advertisement -

– 252 జీవోను వెంటనే రద్దు చేయాలి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జర్నలిస్టుల అరెస్టును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కె తారక రామారావు (కేటీఆర్‌) తీవ్రంగా ఖండించారు. ప్రజల గొంతుక అయిన టీయూడబ్ల్యూజే-టీజేఎఫ్‌ నాయకులు, పలువురు జర్నలిస్టులను అరెస్టు చేయడం, నిర్బంధించడం కాంగ్రెస్‌ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామిక పరిరక్షణ అంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన ఏడో గ్యారంటీ ఇదేనా?అని ప్రశ్నించారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇచ్చిన 252 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కే కుట్ర అని విమర్శించారు. కొత్త జీవో సాకుతో జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో కోత విధించడం ద్వారా ప్రభుత్వం వారి ప్రాథమిక హక్కు లను కాలరాస్తోందని తెలిపారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు, నిర్బంధాన్ని ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రిడిటేషన్ల పునరు ద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

జర్నలిస్టుల అరెస్టుకు హరీశ్‌రావు ఖండన
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల అరెస్టులను మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులకు కేసీఆర్‌ హయాంలో 26 వేల అక్రిడిటేషన్‌ కార్డులను ఇచ్చారని గుర్తు చేశారు. జర్నలిస్టులు, డెస్క్‌ జర్నలిస్టులు అనే తేడా లేకుండా ఇచ్చామని తెలిపారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రిడిటేషన్‌ కార్డులను పదివేలకు తగ్గిస్తామని చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. సోషల్‌ మీడియా, యూట్యూట్‌ జర్నలిస్టులను ఉగ్రవాదులుగా పోల్చడం దారుణమని పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే-టీజేఎఫ్‌ నాయకులు, జర్నలిస్టుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు : దాసోజు శ్రవణ్‌
పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోతపై శాంతియుతంగా వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీయూడబ్ల్యూజే-టీజేఎఫ్‌ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. వినతిపత్రం ఇవ్వడం నేరం కాదనీ, అది పౌరుల బాధ్యత అని తెలిపారు. ప్రశ్నించడం నేరం కానీ, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. కలానికి బేడీలు వేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని విమర్శించారు. ఇది జర్నలిస్టులపై జరుగుతున్న దాడి మాత్రమే కాదనీ, ప్రజల గొంతుకను నొక్కే ప్రయత్నం చేయడమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -