నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగర శివారులోని దుబ్బ బైపాస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిసీ సోమిరెడ్డికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బైపాస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన పుల్లే లక్ష్మి నర్సింహను పట్టకున్నారు. అతని వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేష్ తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ నర్సింహచారీ, హెడ్ కానిస్టేబుళ్లు భూమన్న, రాజన్నలతో పాటు కానిస్టేబుళ్లు బోజన్న, విష్ణు, అవినాష్, సాయి కుమార్, రాం బచ్చన్ లు ఉన్నారు.
గంజాయి విక్రేతల పట్టివేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES