– సుప్రీం బెయిల్ నిరాకరణ
– చంద్రబాబు కక్ష పూరిత రాజకీయం : బొత్స
అమరావతి: రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాము కేసులో మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డి కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అంతకుముదు వీరికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న ఆందోళన వ్యక్తం చేయడంతో అటువంటి చర్యలకు పాల్పడకుండా విచారణ చేయాలని పోలీసులను స్టిస్ జెబి పార్థివాలా, జస్టిస్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన కాసేపటికి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి లను అరెస్ట్ చేస్తున్నట్లు సిట్ ప్రకటించింది. మూడు రోజులపాటు సిఐడి కార్యాలయంలో విచారించి, వారి పాత్రకు సంబంధించి సమగ్ర ఆధారాలు సేకరించిన తరువాతే అరెస్ట్ చేసినట్లు సిట్ తెలిపింది. ఈ కేసులో ధనుంజయరెడ్డి ఎ31, కృష్ణమోహన్‌రెడ్డి గా ఉన్నారు. ఎ33 గోవిందప్ప బాలాజీని రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలజీ భారతీ సిమెంట్స్ ఛార్టర్డ్ ఎకౌంటెంట్‌గానూ ఉన్నారు. రూ.18 వేల కోట్ల లిక్కర్ స్కాము జరిగిందని గతంలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్న సమయంలో మాజీ ఎంపి విజయసాయిరెడ్డి, రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనిచ్చిన సమాచారంతో మరికొంతమందిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో నిందితులుగా పేర్కొన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి వద్దే కీలక సమాచారం ఉందని, లిక్కర్ వ్యవహారం మొత్తాన్ని వారిద్దరే నడిపించారని విచారణలో విజయసాయిరెడ్డి తెలిపారు.. దీంతో సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లి వారిద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో సభ్యులకు ఇచ్చి వచ్చారు. అనంతరం వారిద్దరూ బెయిల్ కోసం తొలుత ఎపి హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌కు నిరాకరించింది. అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. శాసనమండలిలో వైసిపి పక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ అరెస్ట్‌లపై స్పందిస్తూ ప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా ప్రవరిస్తున్నారని, మాజీ ఉద్యోగులపైనా రాజకీయ కక్షసాధింపులకు దిగారని విమర్శించారు. ఈ సంప్రదాయం భవిష్యత్‌లో ఇబ్బంది తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు. వైసిపి హయాంలో కల్తీ మద్యం అమ్మారని ప్రచారం చేసిన డిస్టిలరీల నుండే ప్రస్తుత ప్రభుత్వం అదే మందును కొంటోందని తెలిపారు. మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు కూడా ఈ అరెస్ట్‌ల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కామ్‌లోధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టు
- Advertisement -
- Advertisement -