Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అరెస్టులతో పోరాటాలను, ఉద్యమాలను ఆపలేరు..

అరెస్టులతో పోరాటాలను, ఉద్యమాలను ఆపలేరు..

- Advertisement -

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం : టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కొర్ర శంకర్ 
నవతెలంగాణ – అచ్చంపేట
ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు చేస్తుంటే పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించడం సరైనది కాదని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కోరశంకర్ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పండిట్, పిఈటి పోస్టులు అప్ గ్రేడేషన్, హెచ్ఎం పోస్టులు మంజూరు, సి ఆర్ టి లకు మినిమం బేసిక్ పే, చెల్లించాలని, వారి సర్వీసు రెగ్యులర్ చేయాలని, తదితర 21 డిమాండ్లతో  హైదరాబాద్ కమీషనరేట్ కార్యాలయానికి ముట్టడించ డానికి వెళుతున్న టీఎస్ యుటిఎఫ్ నాయకులు రాములు, బాబురావు, మోతిలాల్, లక్ష్మణ్, లను శుక్రవారం అచ్చంపేట పోలీస్ లు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర  ఆడిట్ కమిటీ సభ్యులు కొర్ర శంకర్ మాట్లాడుతూ అరెస్టులతో  పోరాటాలను, ఉద్యమాలను ఆపలేరని సమస్యలు పరిష్కారం  అయ్యే వరకు పోరాటం చేస్తామని, సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని  హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -