- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్ధులకు చిత్రకళా పోటీలు నిర్వహించారు. పెన్సిల్ ఆర్ట్,కలర్ ఆర్ట్ విభాగంలో ఈ పోటీలు నిర్వహించి విద్యార్ధులను ఎంపిక చేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు శిబిరం ముగింపు ఉత్సవంలో బహుమతులను అందించ నున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.ఇ.టి. రాజు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -