Monday, February 16, 2026
E-PAPER
Homeకరీంనగర్కార్మిక క్షేత్రంలో 'కళ' కు పుర పట్టాభిషేకం

కార్మిక క్షేత్రంలో ‘కళ’ కు పుర పట్టాభిషేకం

- Advertisement -

వైస్ ఛైర్మన్ గా దార్ల సందీప్
ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు
ఏకగ్రీవమైన చైర్మన్, వైస్ చైర్మన్
సిరిసిల్లలో టిఆర్ఎస్ కౌన్సిలర్ల విజయోత్సవ ర్యాలీ
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో పురపాలన పగ్గాలు నేత కార్మిక కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డకు దక్కాయి. జిందం కళ రెండోసారి సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయింది. అలాగే నేత కార్మిక కుటుంబానికి చెందిన దార్ల సందీప్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను పద్మశాలి సామాజిక వర్గానికి ఇవ్వడంతో 13వ వార్డు కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్ రెండు పదవులను ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం సరైనది కాదని టిఆర్ఎస్ పార్టీ నుంచి 27 మంది కౌన్సిలర్లు గెలుపొందగా వారిలో 14 మంది కౌన్సిలర్లు ఇతర సామాజిక కులాలకు చెందిన వారు ..అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పురపాలక సంఘంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్యాంపు నుంచి… మున్సిపల్ కు…
ఉదయం 10:30 గంటలకు క్యాంపు నుంచి నేరుగా సిరిసిల్ల పురపాలక సంఘం కు టిఆర్ఎస్ కౌన్సిలర్లు చేరుకున్నారు 11 గంటలకు కౌన్సిలర్లు ఒక్కొక్కరు 39 మంది ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం అరగంట పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత చైర్ పర్సన్ ఎన్నిక జరిగింది 26 మంది టిఆర్ఎస్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా చైర్ పర్సన్ గా జిందం కళ ను ఎన్నుకున్నట్లు ఏకగ్రీవంగా చేతులెత్తి వారి మద్దతు తెలిపారు. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు అక్కడి నుండి వెళ్లిపోయినప్పటికీ బీజేపీ కౌన్సిలర్లు ఐదుగురు మాత్రం అక్కడే ఉన్నారు వారితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కౌన్సిలర్ బోల్గాం వైష్ణవి అక్కడే ఉండి చైర్ పర్సన్ ఎన్నికల్లో ఆమె కూడా చేతులెత్తి మద్దతు తెలిపారు ఇదే సమయంలో వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే ముందు సమావేశ మందిరంలో నుంచి బయటకు వచ్చిన 13వ వార్డు కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్ వైస్ చైర్మన్ ఇతర సామాజిక వర్గానికి ఇవ్వాలని నాకు వైస్ చైర్మన్ ఇస్తున్నట్లు క్యాంపులో చెప్పి మున్సిపల్ సమావేశ మందిరానికి వచ్చిన తర్వాత మార్పు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.

సమావేశం మందిరం బయట ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో అదే సమయంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ భర్త జిందం చక్రపాణి అక్కడకి చేరుకొని బహిరంగంగా ఇలా మాట్లాడవద్దని ఎంతకు నచ్చజెప్పినా బుర్ర నారాయణ వినకపోవడంతో చక్రపాణి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ పేరు ప్రతిపాదించడంతో సమావేశ మందిరంలోని ఉన్న చైర్ పర్సన్ తో పాటు మరో 25 మంది కౌన్సిలర్లు చేతులెత్తి ఏకగ్రీవానికి మద్దతు తెలిపారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్ పర్సన్ గా జిందం కళ వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం చైర్ పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ టిఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ నుంచి బయటకు వచ్చి పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ తీశారు.

పట్టణ అభివృద్ధి లక్ష్యం -జిందం కళ చైర్పర్సన్ సిరిసిల్ల పురపాలక సంఘం
సిరిసిల్ల పురపాలక సంఘం చైర్ పర్సన్ బాధ్యతను మంత్రి కేటీఆర్ తనకు అప్పగించారు .ఆయన సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాను. ప్రజల సహకారం… భర్త ప్రోత్సాహంతో రెండవసారి విజయవంతంగా పరిపాలన సాగిస్తాను. రాజకీయంలో గత ఐదేళ్లుగా ప్రత్యక్షంగా ఉన్నాను.. నా భర్త జిందం చక్రపాణి గత 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారూ. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పట్టణ అభివృద్ధి విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాను. స్థానికంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. వాటిపై దృష్టి సారించి పనుల పూర్తికి చర్యలు తీసుకుంటాను. సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం. మౌలిక వసతుల కల్పనకు పాటుపడతాను. అత్యధిక నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని ఆదర్శ పురపాలక సంఘంగా తీర్చిదిందేందుకు కృషి చేస్తాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -