Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు కృత్రిమ గర్భధారణతో అధికపాల దిగుబడి: డా.రాజశేఖర్ 

పశువులకు కృత్రిమ గర్భధారణతో అధికపాల దిగుబడి: డా.రాజశేఖర్ 

- Advertisement -

నవతెలంగాణ- కట్టంగూర్
పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా అధిక పాల దిగుబడిన ఇచ్చే మేలు జాతి దూడలను పొంది రైతులకు ఆర్థికంగా మేలు చేకూరుతుందని ఉమ్మడి జిల్లా ఈవో డాక్టర్ రాజశేఖర్ అన్నారు. పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని భాస్కర్లబాయి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలలో పాడి రైతులకు గోపాల మిత్రలు ఎంతగానో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. శిబిరంలో 25 గేదేలకు, రెండు ఆవులకు పరీక్షలు నిర్వహించారు. 25 దూడలకు నట్టల నివారణ మందు, 120 పశువులకు గాలి కుంటు టికాలు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎన్నా మౌనిక వెంకట్ రెడ్డి, మండల పశువైద్య అధికారి రవి, మాజీ సర్పంచ్ ఎన్న వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు శేఖర్, సూపర్వైజర్ సాయి, గోపాల మిత్రలు చెరుకు శ్రీనివాస్, కావటి యాదగిరి, సిబ్బంది రేణుక ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -